Saturday, 15 August 2009

ఎందరో మహానుభావులు....

పాటలంటే సహజంగానే ఇష్టం నాకు, ఐతే ఆ ఇష్టాన్ని ఆసక్తిగా మార్చి సాహిత్యాన్ని మరింత ఆస్వాదించడం నేర్పింది "హాసం" పత్రిక, మధ్యలో ఓ పాటల పుస్తకం వేసేవారు, కొన్ని అరుదైన పాత పాటల సాహిత్యం ఇచ్చేవారు, లలిత గీతాలు ఇచ్చేవారు...దాని ప్రచురణ నిలిపివేసిన కొన్నేళ్ళకి మళ్ళీ "orcutలో lyrics community" నిద్రపోయిన ఆశక్తిని మల్లీ తట్టి లేపింది.


సాహిత్యం చెక్కిన శిల్పం ఐతే దానికి ప్రాణం పోసేవి, సంగీతం, స్వరం, వీటితో పాటు వాయిద్యాలు కూడా, ఒక మంచి పాట విని ఆస్వాదించగలిగామంటే దాని వెనకాల ఎంతో మంది కృషి వుంటుంది. పాటలోని ప్రతి ధ్వనితరంగానికీ ఓ ప్రత్యేకత ఉంది, అందుకే...ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు....



No comments:

Post a Comment