Monday, 14 September 2020

భూలోకమె ఆననందానికి ఇల్లోయి.........

చిత్రం:  భారతీయుడు 

 సంగీతం: ఏ.ఆర్.రహ్మాన్ 

సాహిత్యం:భువనచంద్ర 

స్వరం:  కె.జె.ఏసుదాస్


తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే
తందానానే తానానే ఆనందమే  తందానానే తానానే ఆనందమే
 
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు 

చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట
 
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియా
వయసుడిగే స్వగతంలో అనుబంధం ఆనందమానందం  

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరుజన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే ఆనందమానందం 

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు 

చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట  
 
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

https://www.youtube.com/watch?v=IYx3V3REHbY




Thursday, 1 April 2010

అపుడే నేను నానుంచి వేరైపోయానా...

చిత్రం: అమాయకుడు
సంగీతం: మణికాంత్ కాద్రి
సాహిత్యం: వనమాలి
స్వరం: కార్తిక్



ఇపుడే కనుగొన్నా
వేరెవరో ఈ గుండెల్లో
చేరే ఒక వింతే
ఈ సమయాన

అడుగే వేస్తున్నా
ఆవైపే ఎవరేమన్నా
తనలో నా లోకం చూస్తున్నానా

చూపులకు నిజంగా..., తోచినది కలేనా...
మాటలను స్వరంగా..., మార్చినది తనేనా....

అపుడే నేను నానుంచి వేరైపోయానా...


ఏదో నేనిలా..., ఉన్నా గాలిలా...
నీలో చేరనీ..., శ్వసయ్యేలా...

నిన్న మొన్నలో..., లేదే యే కలా....
నాలో ఈ క్షణం..., తోచే నీలా...

ఇక నా మనసు నా మాటే వినదే ఈవేళ..


సాగే జీవితం..., ఎవ్వరికైనా...
నూరేళ్ళేననీ.., నేనూ విన్నా...

నీతో పాటుగా.., నీడై సాగితే...
ఆయువు తీరునా..., వెయ్యేలైనా...

మనపాదాలు కడదాక స్నేహం చేసేనా.......

Wednesday, 30 December 2009

చెప్పలేను నిజమేదో, నాకు వింతే....

చిత్రం: మన్మధుడు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సీతారామ శాస్త్రి
స్వరం: యస్.పి.చరణ్





నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోనీ ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటు గా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

పూల చెట్టు వూగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగి నట్టు వీణమెట్టు వొనికినట్టు
ఝల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఆ వానా
నీకేవరికి కనిపించదు ఏమైనా

చుట్టూ పక్క లెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా
అంత మంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకు వింతే
కళ్ళను వదిలెళ్లను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే

Tuesday, 15 December 2009

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు.....

చిత్రం : డాక్టర్ చక్రవర్తి
సాహిత్యం : శ్రీశ్రీ
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
స్వరం: ఘంటసాల




మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గము


ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకంతములో
తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గము

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు


నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు

నీ కోసమే కన్నీరు నించుటకు

నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గము


చెలిమియే కరువై వలపే అరుదై
చేదరిన హృదయమే శిల ఐ పోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గము


Wednesday, 23 September 2009

మనసే తేలిపోతొంది మబ్బుల పైనా.....

చిత్రం: రాజు మహారాజు
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
స్వరం:షాన్, సుధ


వీడియో సినెమాలోది కాదు, నేను ఆనందపు అంచులకు వెళ్లేది ఇలాంటివి చూసినప్పుడే :)





కలలోనే కలగంటున్నా
నిజమేదో కనుగొంటున్నా

చెలియా నీ కన్నులలోనా,
నా రూపం గమనిస్తున్నా
ఆనందం అంచున నేనున్నా.....

ఏం చేశావే అందాల మైనా
ఏదో కొత్తలోకాన ఉన్నా
మతిపోతోంది నీవింత మాయేదైనా
గురుతే లేదె నా నిన్న మొన్న
ఎటు పోయిందో ఏకాంతమైనా
మనసే తేలిపోతొంది మబ్బుల పైనా..

ఆనందం అంచున నేనున్నా..
కలలోనే కలగంటున్నా
నిజమేదో కనుగొంటున్నా
ఆనందం అంచున నేనున్నా..

తొలిసారి నా మదిని
ఈరోజే నవ్వించావ్
వేసారే నెమ్మదిని
వెన్నెలపై నడిపించావ్
ఇన్నాళ్ళూ బ్రతికే ఉన్నా
ఇపుడేగా జీవిస్తున్నా
నాసంతోషం ఏదైనా నువ్వేగా....

అచ్చం నీలాగే నేనూ ఉన్నాగా
ప్రేమించే హృదయంలోని తెల్లదనానికి స్వాగతమిస్తున్నా

ఆనందం అంచున నేనున్నా..
ఆకాశం నేనైపోతున్నా..
కలలోనే కలగంటున్నా
నిజమేదో కనుగొంటున్నా....
కనుగొంటున్నా... కనుగొంటున్నా....

వర్షించే మేఘంలా ఉరిమావే ఇన్నాళ్ళూ
కరుణించే దేవతలా కురిశావే పన్నీరు
ఔనంటూ వరమిచ్చావే
నా ప్రేమకు బలమిచ్చావే
శూన్యాన్నే వెలిగించావే దీపంలా

మౌనం కరిగేలా
మట ఎదుగుతున్నా
ప్రణాన్నే వెంటడే నీ పంతానికి నే సొంతం అవుతున్నా ....


ఆనందం అంచున నేనున్నా..
ఆకాశాం నేనైపోతున్నా..
కలలోనే కలగంటున్నా
నిజమేదో కనుగొంటున్నా....

Monday, 31 August 2009

వద్దని ఆపలేరు ఉరికే ఊహని....హద్దులు దాటరాదు ఆశల వాహిని

చిత్రం: స్వర్ణకమలం
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సీతారామ శాస్త్రి

స్వరం: యస్. పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల





ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు

లయకే నిలయమై నీపాదం సాగాలి
మళయానిల గతిలో సుమ బాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురు వేడి
తిరిగే కాలానికీ
ఆఅ ఆఆ ఆ
తిరిగే కాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముందీ

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు

దూకే అలలకూ ఏ తాళం వేస్తారు
ఆహహ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
ఉం ఉం
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఆఅ ఆఅ..
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముంది విలువేముందీ

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు


Monday, 17 August 2009

నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని....

చిత్రం : స్వాతికిరణం
సంగీతం : కే .వి .మహదేవన్
సాహిత్యం : సి . నారాయణ రెడ్డి
స్వరం : యస్. పి. బాలసుబ్రమణ్యం




Get this widget Track details eSnips Social DNA




సా రిగమపదని సా నిదపమగరి సరి ఆఆ……….అ

సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే

హే భారతీ మనసా స్మరామి
హే భారతి మనసా స్మరామి
శ్రీ భారతీ శిరసా నమామి
శ్రీ భారతి శిరసా నమామి
సంగీత సాహిత్య సమలంకృతే……….



వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞ్యానవల్లీ సవుల్లాసిని……..


సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే……….


బ్రహ్మ రసనాగ్ర సంచారినీ ఆఆ……….అ
బ్రహ్మ రసనాగ్ర సంచారిని
భవ్య ఫలకారినీ
నిత్య చైతన్య నిజరూపిని సత్య సందీపిని
బ్రహ్మ రసనాగ్ర సంచారిని
భవ్య ఫలకారినీ
నిత్య చైతన్య నిజరూపిని సత్య సందీపిని

సకల సు కళా సమున్వేషిని
సకల సు కళా సమున్వేషిని సర్వ రస భావ సంజీవినీ

సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే

హే భారతీ మనసా స్మరామి
శ్రీ భారతీ శిరసా నమామి
సంగీత సాహిత్య సమలంకృతే……….