చిత్రం: మన్మధుడు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సీతారామ శాస్త్రి
స్వరం: యస్.పి.చరణ్
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేని పోనీ ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటు గా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
పూల చెట్టు వూగినట్టు పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు
తేనె పట్టు రేగి నట్టు వీణమెట్టు వొనికినట్టు
ఝల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఆ వానా
నీకేవరికి కనిపించదు ఏమైనా
చుట్టూ పక్క లెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా
అంత మంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకు వింతే
కళ్ళను వదిలెళ్లను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే
సీతారామశాస్త్రి గారి మేజిక్ ప్రతి పదంలోనూ కనిపిస్తుంది :)
ReplyDeleteకదా.. :)
ReplyDelete