Wednesday, 23 September 2009

మనసే తేలిపోతొంది మబ్బుల పైనా.....

చిత్రం: రాజు మహారాజు
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
స్వరం:షాన్, సుధ


వీడియో సినెమాలోది కాదు, నేను ఆనందపు అంచులకు వెళ్లేది ఇలాంటివి చూసినప్పుడే :)





కలలోనే కలగంటున్నా
నిజమేదో కనుగొంటున్నా

చెలియా నీ కన్నులలోనా,
నా రూపం గమనిస్తున్నా
ఆనందం అంచున నేనున్నా.....

ఏం చేశావే అందాల మైనా
ఏదో కొత్తలోకాన ఉన్నా
మతిపోతోంది నీవింత మాయేదైనా
గురుతే లేదె నా నిన్న మొన్న
ఎటు పోయిందో ఏకాంతమైనా
మనసే తేలిపోతొంది మబ్బుల పైనా..

ఆనందం అంచున నేనున్నా..
కలలోనే కలగంటున్నా
నిజమేదో కనుగొంటున్నా
ఆనందం అంచున నేనున్నా..

తొలిసారి నా మదిని
ఈరోజే నవ్వించావ్
వేసారే నెమ్మదిని
వెన్నెలపై నడిపించావ్
ఇన్నాళ్ళూ బ్రతికే ఉన్నా
ఇపుడేగా జీవిస్తున్నా
నాసంతోషం ఏదైనా నువ్వేగా....

అచ్చం నీలాగే నేనూ ఉన్నాగా
ప్రేమించే హృదయంలోని తెల్లదనానికి స్వాగతమిస్తున్నా

ఆనందం అంచున నేనున్నా..
ఆకాశం నేనైపోతున్నా..
కలలోనే కలగంటున్నా
నిజమేదో కనుగొంటున్నా....
కనుగొంటున్నా... కనుగొంటున్నా....

వర్షించే మేఘంలా ఉరిమావే ఇన్నాళ్ళూ
కరుణించే దేవతలా కురిశావే పన్నీరు
ఔనంటూ వరమిచ్చావే
నా ప్రేమకు బలమిచ్చావే
శూన్యాన్నే వెలిగించావే దీపంలా

మౌనం కరిగేలా
మట ఎదుగుతున్నా
ప్రణాన్నే వెంటడే నీ పంతానికి నే సొంతం అవుతున్నా ....


ఆనందం అంచున నేనున్నా..
ఆకాశాం నేనైపోతున్నా..
కలలోనే కలగంటున్నా
నిజమేదో కనుగొంటున్నా....

6 comments:

  1. Video is too good. అంటే పాట బాగోలేదు అని కాదు :-)

    ReplyDelete
  2. కదా.... :)
    పాట నచ్చి వెతుకుతుంటే vedio దొరికింది
    credit goes to the song along with the vedio composer

    ReplyDelete
  3. నేను, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ స్థబ్దతని ఈ ఉదయం నుంచీ ఫీలయ్యాను. నేనంతే. ఇప్పుడే కాస్త తీరిక చిక్కి మీ బ్లాగుకి వచ్చాను. కంటి నీరు కమ్మినా ఈ పదాలు స్పష్టంగా కనిపించాయి. ఈ పలుకులు ఇంకా స్పష్టంగా వినిపించాయి. "అచ్చం నీలాగే నేనూ ఉన్నాగా
    ప్రేమించే హృదయంలోని తెల్లదనానికి స్వాగతమిస్తున్నా" ఆ వీడియో చూస్తుంటే ప్రకృతి రూపం ధరించి నా ప్రక్కన కూర్చుని సముదాయించినట్లే వుంది. ఇది మీరు నా బ్లాగుకి రావటానికి పిలుపు మాత్రం కాదు. కనుక ఆ ప్రయత్నం చేయొద్దు. థాంక్స్.

    ReplyDelete
  4. :-0
    సరే మీరేదంటే అదే
    కాని డిసెంబర్ 31 న మాత్రం మీరు గేటుకి తాళం వేసినా గోడ దూకి మరీ వచ్చేస్తాను ;-p

    ReplyDelete
  5. అలా ఎందుకు. డిశంబర్ ముప్పై వరకు నా మీద నిరసన ఏమిటి? ;)

    ReplyDelete
  6. మీకలా అర్ధమైందా ;-p

    అంటే ఎలాగో మెలకువగా ఉండాలి కదా మరువపు గంధాలను ఆశ్వాదిస్తూ గడిపేద్దామని...పైగా ఆ రోజు పౌర్ణమి కూడాను....ఈలోపు చదివేస్తే మొదటిసారి చదివిన అనుభూతి ఉండదు కదా.....

    ReplyDelete